![]() |
![]() |

బిగ్ బాస్ సీజన్-9 లో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న కంటెస్టెంట్స్ ఎవరంటే సంజన అనడంలో ఆశ్చర్యం లేదు. మిడ్ వీక్ ఎలిమినేట్ సంజన అయిందని అనగానే అందరు షాక్ అయ్యారు. రీ ఎంట్రీ ఉంటుందని తెలిసి కూడా ఏదో మూల ఎలిమినేట్ అవుతుందేమోనన్న భయం లేకపోలేదు.
అయినా బిగ్ బాస్ ట్విస్ట్ ఇచ్చి హౌస్ మేట్స్ కొంతమందిని కొన్నిటిని త్యాగం చేయమన్నప్పుడు.. చేశారు. తనూజ కాఫీ త్యాగం చేసింది. ఇమ్మాన్యుయల్ కెప్టెన్సీ త్యాగం చేసాడు. ఇక భరణి అయితే ఒక్క నిమిషం ఆలోచించకుండా తన సెంటిమెంట్ బాక్స్ ని స్టోర్ రూమ్ లో పెట్టాడు. సంజనని ఎలిమినేట్ చెయ్యడానికి డిసైడ్ అయినప్పుడు తన వంతు తన పాయింట్స్ చెప్పి తను బయటకు వెళ్ళడానికి ఒక రీజన్ అయ్యాడు. సంజన స్టేజ్ పై ఉన్నప్పుడు భరణి లేచి.. మిస్ యూ సంజన అంటాడు. మీరే బయటకు పంపారు కదా అని నాగార్జున సంజన అనగానే భరణి సైలెంట్ అవుతాడు. అది రీగ్రేట్ గా ఫీల్ అయ్యి మళ్ళీ సంజన లోపలికి రావడానికి భరణి కారణం అయ్యాడు.
రీతూ ఎప్పుడు అందంగా ఉండాలంటూ నీట్ గా రెడీ అవుతూ అందరి దృష్టిలో పడాలని, స్క్రీన్ స్పేస్ రావాలని పరితపిస్తుంది. ఇక సంజన కోసం తన జుట్టు త్యాగం చేస్తుంది. ఒకవైపు ఏడుస్తునే త్యాగం చేసింది. సంజన లోపలికి వచ్చాక ఏదైనా ఒక వీక్ కాకపోతే ఇంకొక వీక్ సంపాదించుకుంటాం కానీ జుట్టు ఆరు నెలలు టైమ్ పడుతుంది థాంక్స్ అని రీతూ ని హగ్ చేసుకుంటుంది. ఇక సంజన కోసం సుమన్ స్మోక్ చేయకుండా ఉండలేనని ఖచ్చితంగా చెప్పేసాడు. అది తన ఫ్యాన్స్ కి డిజప్పాయింట్ మెంట్ లాగే ఉంటుంది. సంజన కోసం త్యాగం చేసిన వాళ్ళందరూ తనతో వచ్చిన సెలబ్రిటీస్ మాత్రమే హెల్ప్ చేశారు. ఇకమీద సంజన ఎవరితో ఎలా ఉంటుందో చూడాలి మరి.
![]() |
![]() |